పుల్వామా దాడికి నేటికి నాలుగేళ్లు

నాలుగేళ్ల క్రితం ఈరోజే జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి దిగారు.

Update: 2023-02-14 03:26 GMT

నాలుగేళ్ల క్రితం ఇదే రోజు జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి దిగారు. ఆత్మాహుతికి పాల్పడ్డారు. నాటి నుంచి నేటి వరకూ ఫిభ్రవరి 14న బ్లాక్ డేగా పరిగణిస్తారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీు ఫోర్స్ కు చెందిన నలభై మంది సైనికులు మరణించారు. ఆత్మాహుతి దాడి చేయడంతో ఈ దుర్ఘటన జరిగింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

నేడు బ్లాక్ డే....
జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై అవంతపురం సమపీంలో 2019 ఫిబ్రవరి 14 సాయంత్రం నాలుగు గంటలకు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. జమ్ము నుంచి సైనికుల వాహనం శ్రీనగర్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడికి జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు కారణంగా ప్రకటించుకున్నారు. పక్కా వ్యూహంతోనే దాడి చేశారు. ఆత్మాహుతి దాడికి కాశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ ను జైషే మొహమ్మద్ సంస్థ వినియోగించుకుంది. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఉగ్రవాది కూడా ఈ ఘటనలో హతమయ్యాడు. దేశ వ్యాప్తంగా అమరవీరులకు నేడు నివాళులర్పిస్తున్నారు.


Tags:    

Similar News