నాలుగో దశ పోలింగ్ ప్రారంభం
ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగో దశ పోలింగ్ ప్రారంభమయింది. ఈ దశలో మొత్తం 59 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగో దశ పోలింగ్ ప్రారంభమయింది. ఈ దశలో మొత్తం 59 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో జరుగుతున్న నియోజకవర్గాల్లో బీజేపీకి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో ఈ 59 నియోజకవర్గాల్లో 51 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి కూడా తాము అదే సంఖ్యలో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎవరికి వారిదే ధీమా....
కానీ గత ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లోనే గెలిచిన సమాజ్ వాదీ పార్టీ ఈసారి నలభైకి పైగా స్థానాల్లో ఇక్కడ గెలుస్తుందని ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విశ్వాసంతో ఉన్నారు. యూపీలోని 9 జిల్లాలైన పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ 59 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.