ఫోర్త్ వేవ్... భారత్ ముంగిట ముప్పు
దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చినట్లే కనపడుతుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.
దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చినట్లే కనపడుతుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 17,336 కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనా కారణంగా మరణించారు. ఒకే రోజులో ఐదు రెట్లు కరోనా కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తుంది. నిన్న కరోనా బారిన పడి 13,029 మంది కోలుకున్నారు. కోలుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కోలుకునే వారి సంఖ్య శాతం 98.60 శాతంగా నమోదయింది.
ఒక్కరోజులోనే.....
ఇప్పటి వరకూ భారత్ లో 4,33,62,294 మంది కరోనా బారిన పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 4,27,49,056 మంది కోలుకున్నారని తెలిపింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 5,24,954 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు దేశంలో 88,284 ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఒక్కసారిగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.