బూస్టర్ డోస్ ఉచితంగానే..!
18 ఏళ్లు పైబడ్డ వారందరికీ ఈ ప్రికాషన్ డోసును ఉచితంగా అందించనున్నట్లు
కరోనా బూస్టర్ డోస్‌ను ఉచితంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం నిర్ణీత ధరలకు ప్రైవేట్ కేంద్రాల ద్వారా పంపిణీ అవుతున్న బూస్టర్ డోస్ ను శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. బూస్టర్ డోస్‌ను శుక్రవారం నుంచి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్‌ను అందించనున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బూస్టర్ డోస్ ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.
18 ఏళ్లు పైబడ్డ వారందరికీ ఈ ప్రికాషన్ డోసును ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర కేబినేట్ తెలిపింది. అర్హులైన వారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ బూస్టర డోసును పొందవచ్చని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ నెల 15 నుంచి 75 రోజుల పాటు 18- 59 ఏళ్లున్న వారందరికీ ఉచితంగా బూస్టర్ డోసు అందించనున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకన్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారిలో 96శాతం మంది ఒకడోసు తీసుకోగా.. 87శాతం మంది రెండు డోసులు పొందారు. బూస్టర్ డోస్ ను తీసుకోడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఉచితంగా పంపిణీ చేస్తే బూస్టర్ డోస్ తీసుకునే వారి సంఖ్య కూడా పెరగనుంది.