బంగారం-వెండి ధరలు ఎంత పెరిగాయంటే?

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతున్నాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు

Update: 2023-07-25 02:05 GMT

gold, silver, hyderabad

మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం నాడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది. గత 24 గంటల్లో బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా ఉంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,160గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,450లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,490 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు నేడు కాస్త తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర మంగళవారం రూ. 77,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,500ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,500గా ఉండగా, చెన్నైలో రూ. 80,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,000 గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతున్నాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు దాదాపు 10 డాలర్లు తగ్గింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1955 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ రేటులో స్వల్ప మార్పు కనిపిస్తోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.35 డాలర్ల వద్ద ఉంది.


Tags:    

Similar News