బంగారం కొనాలనుకుంటున్నారా.. మీకో గుడ్ న్యూస్

వరుసగా రెండు రోజలు పెరిగిన బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల

Update: 2023-07-29 01:58 GMT

వరుసగా రెండు రోజలు పెరిగిన బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,110గా ఉంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 350.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 380 తగ్గడం విశేషం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,250 ఉండగా 24 క్యారెట్ల ధర రూ. 60,260గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,550 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,110గా కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,110గా కొనసాగుతూ ఉంది.
వెండి ధర కూడా బాగా తగ్గింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర శనివారం రూ. 76,400లుగా నమోదైంది. కిలో వెండి ధరపై రూ. 2000 తగ్గింది. హైదరాబాద్‌లో రూ. 79,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 79,500ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 76,400గా ఉండగా, చెన్నైలో రూ. 79,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,250 గా నమోదైంది.


Tags:    

Similar News