బంగారం ధరలు కాస్త పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 500 పెరిగి రూ.55,600 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 550 పెరిగి ప్రస్తుతం రూ.60,650 వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,800గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,650గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,900లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,980 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 60,650గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,650 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర బుధవారం రూ. 78,400లుగా ఉంది. కిలో వెండి ధరపై రూ. 400 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 78,400గా ఉండగా, చెన్నైలో రూ. 82,000గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 82,000ల వద్ద కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1984 డాలర్లకు ఎగబాకింది. స్పాట్ సిల్వర్ రేటు 25 డాలర్లపైన ట్రేడవుతోంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ. 82.070 వద్ద కొనసాగుతోంది.