బంగారం ధర ఎంత పెరిగిందంటే?

బంగారం ధర కాస్త పెరిగింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి 10 గ్రాములకు రూ. 54,250 వద్ద కొనసాగుతోంది.

Update: 2023-07-07 01:45 GMT

gold silver rates in hyderabad

బంగారం ధర కాస్త పెరిగింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి 10 గ్రాములకు రూ. 54,250 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 24 క్యారెట్స్ పసిడి రేటు కూడా 100 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.59,160 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు ఎగబాకింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 100 పెరిగి రూ.54,400 వద్ద ట్రేడవుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,320 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.900 పెరగడంతో ప్రస్తుతం రూ. 76,700 మార్కు వద్ద కొనసాగుతూ ఉంది. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.800 పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి రూ. 73,000, బెంగళూరులో రూ. 71,250, హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 76,700, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,700వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1920 డాలర్ల నుంచి 1910 డాలర్లకు తగ్గింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 22.71 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


Tags:    

Similar News