బంగారం-వెండి ధరలు.. మళ్లీ..!

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

Update: 2023-08-02 02:12 GMT

దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం నాడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,440గా ఉంది. గత 24 గంటల్లో 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 160 పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,570గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,440గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,760 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,440గా నమోదైంది.
వెండి ధరలు కూడా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర బుధవారం రూ. 78,000లుగా ఉంది. గత 24 గంటల్లో కిలో వెండి ధరపై రూ. 1000 పెరిగింది. హైదరాబాద్‌లో రూ. 81,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 81,000ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 78,000గా నమోదైంది. చెన్నైలో రూ. 81,000గా.. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500 గా నమోదైంది.


Tags:    

Similar News