మగువలకు గుడ్ న్యూస్.. బంగారం ధర ఎంతంటే?

బంగారం ధర భారీగా తగ్గుతూ వస్తోంది. గత నెలలో బంగారం ధర పెరగగా..

Update: 2023-08-19 02:22 GMT

బంగారం ధర భారీగా తగ్గుతూ వస్తోంది. గత నెలలో బంగారం ధర పెరగగా.. ఆగస్టు నెలలో తగ్గుతూ వస్తోంది. ఆగస్టులో బంగారం ధర భారీగా పతనం అవ్వడం విశేషం. గత 10 రోజుల్లో కూడా 7 సార్లు బంగారం ధర తగ్గింది. నేడు మాత్రం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59, 020 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 100 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం భారీగా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి, రూ. 1000 పెరిగి రూ. 76, 700 గా నమోదు అయింది.దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లపై రూ. 54,250 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.59,170 మార్కు వద్ద ఉంది. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,560లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,520 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా కొనసాగుతోంది.

బంగారం ధరలు స్థిరంగా ఉన్నా.. వెండి రేట్లు మాత్రం పెరిగాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ. 73,500 మార్కు వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కూడా రూ. 1000 ఎగబాకి కిలోకు రూ. 76,700 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1888 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. స్పాట్ సిల్వర్ ఏమో 22.77 డాలర్ల వద్ద ఉంది.


Tags:    

Similar News