బంగారం కొనాలనుకుంటున్నారా.. గుడ్ న్యూస్

గత నాలుగు రోజులుగా పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2023-08-26 02:05 GMT

gold silver rates in hyderabad

గత నాలుగు రోజులుగా పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం నాడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరలపై ఎలాంటి మార్పు లేదు.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,600గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,230గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,230 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,830లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,820 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,500లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 59,450గా ఉంది.
గత 24 గంటల్లో వెండి ధరలు కాస్త తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర శనివారం రూ. 76,400లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 79,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 79,500ల వద్ద ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 76,400గా ఉండగా, చెన్నైలో రూ. 79,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,000 గా నమోదైంది.


Tags:    

Similar News