బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గిందోచ్

బంగారం ప్రియులకు శుభవార్త. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.

Update: 2023-08-10 02:27 GMT

బంగారం ప్రియులకు శుభవార్త. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 110 తగ్గింది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,110గా ఉంది. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,330 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది.
వెండి ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 73,500లుగా ఉంది. గత 24 గంటల్లో కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. హైదరాబాద్‌లో రూ. 76,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,700ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,500గా నమోదైంది. చెన్నైలో రూ. 76,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,000 నమోదైంది.


Tags:    

Similar News