బంగారం కొనాలనుకున్న వాళ్లకు గుడ్ న్యూస్
బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్
బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్ నేడు బంగారం ధరలు కాస్త తగ్గాయి. మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,2800గా ఉంది. సోమవారంతో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 తగ్గింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,430గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,280గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,250 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,280గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,280గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,550 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,250లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 60,410గా ఉంది.
వెండి ధరలు మాత్రం రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర మంగళవారం రూ. 77,000లుగా ఉంది. హైదరాబాద్‌లో రూ. 80,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 80,000ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,000గా ఉండగా.. చెన్నైలో రూ. 80,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500గా నమోదైంది.