గోల్డ్ లవర్స్ కి పండగే.. దిగి వస్తున్న బంగారం !
ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. అదే సమయంలో ధరలూ పెరుగుతాయి. కానీ గత వారంరోజులుగా..
బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. ముఖ్యంగా మగువలకు బంగారం అంటే మహా ఇష్టం. పెళ్లి, పేరంటం, పండుగలు, ఇతర శుభకార్యాలు ఇలా.. సందర్భం ఏదైనా అలంకరణకు బంగారు నగలు కావాల్సిందే. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. అదే సమయంలో ధరలూ పెరుగుతాయి. కానీ గత వారంరోజులుగా మాత్రం బంగారం ధరలు దిగివస్తున్నాయి. ప్రతిరోజూ ఎంతోకొంత తగ్గుతూ వస్తోన్న బంగారం.. కొనుగోలు దారులకు కాస్త ఊరటనిస్తోంది. ఈరోజు (ఫిబ్రవరి26) కూడా తులం బంగారం పై రూ.330 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180 గా ఉంది. ఇక వెండి ధర అయితే భారీగానే తగ్గింది. కిలో వెండిపై ఏకంగా రూ.900 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.70,000కు దిగివచ్చింది. తాజాగా ధరలు తగ్గడంతో.. బంగారం కొనుగోళ్లకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు.