స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ52,160 వద్ద కొనసాగుతోంది.
పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యే సమయానికి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ నెల నుండి 42 రోజుల్లో లక్షల జంటలు పెళ్లితో ఒక్కటి కానున్నాయి. పెళ్లంటే వెంటనే గుర్తొచ్చేది నగలు. ఏమి ఉన్నా లేకున్నా.. పెళ్లికూతురికి నగలే అలంకారం. పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో.. బంగారం విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. బంగారం ధరల హెచ్చుతగ్గులతో పనిలేకుండా చాలామంది కొనుగోలు చేస్తుంటారు. రెండ్రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 47,810 పలుకుండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,210కి చేరింది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ52,160 వద్ద కొనసాగుతోంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,160 ఉంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కేజీ వెండి ధర రూ.67,800 ఉండగా.. విశాఖలో కేజీ వెండి ధర రూ.67,400గా ఉంది.