GOOD NEWS : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పసిడి ప్రియులకు ఇది శుభవార్తే. నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.750 మేర..
న్యూ ఢిల్లీ : పసిడి ప్రియులకు ఇది శుభవార్తే. నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.750 మేర, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.800 వరకూ తగ్గాయి. బంగారం కంటే వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2100 తగ్గి రూ.58,600కు దిగొచ్చింది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,640, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,970 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లు రూ. 46,450, 24 క్యారెట్లు రూ.50,670 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670కి దిగొచ్చింది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 50,670 కి తగ్గింది.
తెలుగురాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గింది. చెన్నై, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.63,400గా ఉంది. ఢిల్లీ, కేరళ, ముంబై, లక్నో లలో కేజీ వెండి ధర రూ.58,700గా ఉంది.