స్థిరంగా బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..
బంగారం ధరల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు సహజం. బంగారం కొనాలనుకునేవారు ధర కొంచెం తగ్గినపుడే కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కొనాలంటే.. ధర ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా కొనక తప్పద. నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 6 గంటల వరకూ నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 కు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,330కు దిగొచ్చింది. ముంబై, కోల్ కతా నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,330 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలతో పాటు చెన్నై, కేరళ లలో కిలో వెండి ధర రూ.77,800 ఉంది.