బంగారం ధరలు కాస్త తగ్గాయి
బంగారం కొనాలని అనుకునే వాళ్లకు ఓ గుడ్ న్యూస్. ఈరోజు బంగారం రేటు తగ్గింది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట
బంగారం కొనాలని అనుకునే వాళ్లకు ఓ గుడ్ న్యూస్. ఈరోజు బంగారం రేటు తగ్గింది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి రూ.55,400 గా ఉండగా, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి 60,450 గా ఉంది. హైదరాబాద్‌లో బంగారం ధర తగ్గింది. ఇక్కడ 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర తాజాగా రూ.100 తగ్గి రూ. 55,400 వద్ద ఉంది. 24 క్యారెట్లకు తులం గోల్డ్ రేటు రూ.100 తగ్గి.. రూ.60,450 వద్ద ట్రేడవుతోంది. జూన్ 10న కూడా గోల్డ్ రేటు రూ.100 పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం రేటు తాజాగా తగ్గింది. అక్కడ 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు రూ.100 తగ్గి రూ.55,550 వద్ద ఉండగా.. 24 క్యారెట్స్ బంగారం రేటు రూ.100 పడిపోయి రూ.60,600 వద్ద కొనసాగుతోంది.
వెండి ధర హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లలో భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు తాజాగా రూ. 500 తగ్గి రూ.79,300 వద్ద ఉంది. ఢిల్లీలో రూ.200 తగ్గి.. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ. 74,300 వద్ద ఉంది. బంగారం, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం రేటు స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1958 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.