తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలలో 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి 54,050 గా ఉండగా

Update: 2023-07-04 02:17 GMT

gold, silver, hyderabad

బంగారం ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలలో 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి 54,050 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.110 కు తగ్గి 58,960 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1920 డాలర్లపైన ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు మాత్రం ఔన్సుకు 22.90 డాలర్ల మార్కు వద్ద కొనసాగుతోంది.

దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పతనం అయ్యాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు ప్రస్తుతం రూ.100 పతనమైంది. దీంతో రూ.54,050 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.110 పడిపోగా.. రూ.58,960 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో గోల్డ్ రేట్లు 22 క్యారెట్లకు 10 గ్రాములకు రూ.100 తగ్గి రూ.54,200 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.100 పతనమై రూ. 59,120 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.200 తగ్గి.. రూ. 75,500 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో వెండి రేటు కిలోకు ప్రస్తుతం రూ.71,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.


Tags:    

Similar News