బంగారం ధర.. మళ్లీ తగ్గిందోచ్

బంగారం ధర మళ్లీ తగ్గింది. అంతర్జాతీయంగానూ, దేశీయంగా గత 3 రోజుల్లో బంగారం ధర భారీగానే తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్ర

Update: 2023-06-23 01:50 GMT

బంగారం ధర మళ్లీ తగ్గింది. అంతర్జాతీయంగానూ, దేశీయంగా గత 3 రోజుల్లో బంగారం ధర భారీగానే తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జూన్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,450గా ఉంది. జూన్ 22తో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 తగ్గింది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,600గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,850లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,830 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,500లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450లుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450 వద్ద కొనసాగుతోంది.
దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 72,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1000 తగ్గింది. హైదరాబాద్‌లో రూ. 75,000లుగా ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 75,000ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 72000లుగా ఉండగా.. చెన్నైలో రూ. 75000లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72000గా నమోదైంది.


Tags:    

Similar News