గోల్డ్ లవర్స్ కు వరస షాక్ లు

ఈరోజు బంగారం ధరలు కూడా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.150లు పెరిగింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2023-03-03 04:20 GMT

బంగారం వెండి ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గేది తక్కువ సార్లు పెరిగేది ఎక్కువ సార్లు అన్న రీతిలో కొనసాగుతాయి. బంగారం భారతీయ కుటుంబాలలో ఒక భాగంగా మారింది. ప్రపంచ దేశాల్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే దేశంలో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. మిగిలిన దేశాల్లో గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేస్తారు. కానీ భారత్ లో మాత్రం ఆభరణాల కొనుగోలుపైనే మక్కువ చూపుతారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

స్థిరంగా వెండి ధర...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు రెండో రోజు కూడా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.150లు పెరిగింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,750 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,450 రూపాయలు పలుకుతుంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 70,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News