పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడిప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Update: 2022-06-01 03:17 GMT

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడిప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గడం వినియోగదారులకు ఊరటనిచ్చే విషయమే. పది గ్రాముల బంగారం పై వందరూపాయలు తగ్గింది. బంగారాన్ని ఎక్కువగా పెట్టుబడికి వినియోగిస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో ధరలు తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు ఆనందం కల్గిస్తుంది.

హైదరాబాద్ లో....
ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇ$లా ఉన్నాయి. మార్కెట్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 52,100 లుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 47,850 రూపాయలుగా ఉంది. నిన్న పెరిగిన బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గడం వినియోగదారులకు ఊరటనిచ్చే అంశంగానే చెప్పాలి. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు ికిటకిట లాడుతున్నాయి. ఈ సమయంలో ధరలు తగ్గడం కొంత గుడ్ న్యూస్ కిందనే చూడాలి.
వెండి ధర మాత్రం...
బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు మాత్రమ పెరగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వెండి కేజీకి రూ.500లు పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి 67,500లకు చేరుకుంది. వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News