బంగారం బాగా దిగొచ్చింది
ఈరోజు బంగారం ధరలు దేశంలో భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.650లు తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి.
బంగారం ప్రియంగా మారుతుంది. రోజురోజుకూ భారంగా తయారవుతుంది. ధరలు పెరుగుతున్నప్పటికీ బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నా దాని డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి. బంగారం దిగుమతులు కూడా కేంద్రం తగ్గించడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
భారీగా తగ్గిన వెండి...
అయితే ఈరోజు బంగారం ధరలు దేశంలో భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.650లు తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండిపై దాదాపు 1,450 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,630 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 67,500 రూపాయలకు చేరింది