దిగొచ్చిన బంగారం ధరలు
దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారంపై రూ.240లు తగ్గింది.
బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. తగ్గితే ఎంత ఆనందమో చెప్పనలవి కాదు. అందునా పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలంటారు. లేకుంటే ధరలు పెరిగే అవకాశముంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతాయని చెబుతూనే ఉన్నారు. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం పది తులలా బంగారం డెబ్భయి వేలకు చేరుకునే అవకాశముంది. అందుకే తొందరపడ అవసరమున్న వారు కొనుగోలు చేస్తే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారంపై రూ.240లు తగ్గింది. కిలో వెండి ధరపై రూ.300లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,500 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,450 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ ల 75,700 రూపాయలు పలుకుతుంది.