బంగారం భారమాయనే
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.550 లు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది
బంగారం ధరలు వరసగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారాన్ని కొనుగోలు చేయడానికి అనేక మంది ఉత్సాహం చూపుతుంటారు. అయితే వరసగా పెరుగుతున్న ధరలు వారిని వెనుకంజవేసేలా చేస్తున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనుగోలు చేయడం భారంగా మారింది.
వెండి కూడా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.550 లు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధరపై రూ.200లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,550 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,420 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,700 రూపాయలకు చేరుకుంది.