మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మరోసారి దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.200లు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది

Update: 2023-03-25 03:33 GMT

బంగారం ధరలు పెరగడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది. బంగారం ధరలు వారంలో ఆరు రోజులు పెరిగితే ఒకరోజు తగ్గుతాయి. పెరిగితే భారీగా, తగ్గితే స్వల్పంగా ధరలు ఉండటం మామూలయి పోయంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కేంద్ర బడ్జెట్ లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం, కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరుగుతుండటం పేద, మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది.

భారీగా వెండి...
తాజాగా మరోసారి దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.200లు పెరిగింది. దీంతో మరోసారి అరవై వేల రూపాయలకు పది గ్రాముల బంగారం చేరుకున్నట్లయింది. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ.400లు వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,000 రూపాయలుగా నమదోయింది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర 75,500 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News