పండగ చేస్కోండి... ఇక కొనేయండి

దేశంలో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కిలో వెండి పై రూ.1000లు పెరిగింది

Update: 2022-12-28 02:47 GMT

పసిడి అంటేనే భారతీయ మహిళలు ప్రాణమిస్తారు. తమకు ఉన్న దాంట్లో కొంత బంగారం కొనుగోలుకు వెచ్చిస్తారు. సంప్రదాయంగా వస్తున్న ఆచారాలకు బంగారాన్ని ఉపయోగించడం ఒకప్పుడు. ఇప్పుడు బంగారం ఖరీదుగా మారడంతో అది విలువైన వస్తువుగా మారి గౌరవం చేకూరుస్తుందని నమ్ముతున్నారు. ధరలతో సంబంధం లేకుండా భారత్ లో బంగారం కొనుగోళ్లు జరుగుతున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వారి మాట ఎలా ఉన్నా పసిడికి మాత్రం భారత్ లో డిమాండ్ తగ్గడం లేదు. ధరలు పెరగకపోతే సంబరపడి పోయే పరిస్థితికి వచ్చింది.

వెండి మాత్రం...
తాజాగా దేశంలో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కిలో వెండి పై రూ.1000లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,480 రూపాయల వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,950 రూపాయలు పలుకుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 74,200 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News