బంగారం ధరలు తగ్గాయోచ్
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.100లు తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది.
బంగారం కొనుగోళ్లు తగ్గిపోతున్నాయి. డిమాండ్ ఉన్నా ధరలను భరించలేక కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడటం లేదు. పెళ్లిళ్లు, శుభకార్యక్రమాలకు కూడా బంగారాన్ని తగ్గించుకుని ఆ మొత్తంతో ఇతర పెట్టుబడులు పెట్టుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కేంద్ర బడ్జెట్ లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం, బంగారం దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వంటి కారణాలతో ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం కొనాలంటే గగనమయి పోయింది. సామాన్యులకు భారంగా మారింది. అందుకే గతంలో మాదిరి కొనుగోళ్లు లేవంటున్నారు.
వెండి కూడా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.100లు తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,630 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 67,400 రూపాయలు పలుకుతుంది.