బ్యాడ్ న్యూస్ భారీగా పెరిగిన గోల్డ్
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.600ల వరకూ పెరిగింది. వెండి ధర పెరిగింది
బంగారం ధరలు సామాన్యులకు అంతకంతకూ అందకుండా పోతున్నాయి. సామాన్యులకు బంగారం ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. వరసగా బంగారం ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు పెరుగుతుండటంతో పెళ్లిళ్ల సీజన్ లో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బంగారం కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. ధరలు మరింత పెరుగుతాయని కొనుగోలు చేయాలన్నా అందుకు అవసరమైన మొత్తం లేకపోవడంతో అనేక మంది మిన్నకుండి పోతున్నారు. పెట్టుబడిగా చూసేవారు మాత్రం బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
వెండి కూడా...
తాజాగా దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.600ల వరకూ పెరిగింది. వెండి ధరల్లోనూ పెరుగుదల కన్పించింది. కిలో వెండి ధరపై రూ.1,000లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,800 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,780 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 75,400 రూపాయలుగా ఉంది.