బంగారం ధరలు పైపైకి

ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.750లు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి.

Update: 2023-03-12 03:30 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు ముందు నుంచే చెబుతున్నారు. వారి అంచనాలకు తగిన విధంగానే బంగారం ధరలు గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. ఇది పసిడిప్రియులకు కొంత ఇబ్బంది కలిగించే అంశమే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ తరుణంలో బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులు, ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు మరింత పెరగవచ్చని అంచనాలు వినపడుతున్నాయి. అయినా పెళ్లిళ్లకు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి రావడంతో మధ్య, పేద తరగతి ప్రజలు పెదవి విరుస్తున్నారు. పెట్టుబడులుగా చూసేవారు సయితం ధరలు తగ్గిన తర్వాత కొనుగోలు చేయాలని వెనక్కు తగ్గుతున్నారు.

వెండి కూడా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.750లు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండిపై రూ.450లు పెరిగింది. రెండో రోజూ వరసగా బంగారం ధరలు పెరగడంతో బంగారం కొనుగోలు చేసేవారు వెనక్కుతగ్గుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,150 రూపాయలుకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,890 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 68,700 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News