బంగారం మళ్లీ షాకిచ్చిందే
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.500లు పెరిగింది. వెండి ధరలు మాత్రం తగ్గాయి
బంగారం ధరలు అంతే. తక్కువ సార్లు తగ్గితే ఎక్కువ సార్లు పెరగడం బంగారం విషయంలోనూ మనం చూస్తుంటాం. గత కొద్ది రోజులుగా ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియులు సంబరపడిపోతున్నారు. అయితే కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం, కేంద్ర బడ్జెట్ లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం, దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేశారు. ఈ ఏడాది పది తులాల బంగారం 70 వేలకు చేరుకుంటుందని కూడా మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. బంగారం ధరలు పెరగడం కారణంగా కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరిగే బంగారం విషయంలో గత కొంతకాలంగా ప్రజలు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు.
తగ్గిన వెండి ధర...
ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.500లు పెరిగింది. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధరపై రూ.200లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,400 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,070 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధరలు స్వల్పంగా తగ్గి కిలో వెండి ధర 67,300 రూపాయలకు చేరుకుంది.