రికార్డ్ బ్రేక్ చేసిన గోల్డ్
దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.1,630 పెరిగింది. వెండి కూడా భారీగా పెరిగింది
బంగారం ధరలు అంతే. సీజన్‌తో సంబంధం లేకుండా పెరిగిపోతుంటాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూాపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంపు వంటి కారణాలతో బంగారం ధరలు పెరిగిపోతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని బ్యాంకింగ్ సంక్షోభం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఈ తరుణంలో బంగారం కొనుగోళ్లు మధ్య, పేద తరగతి వర్గాలకు సాధ్యం కాదు. అవి వారికి అందనంత దూరంలో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం ధరల పెరుగుదలను చూసి ఆ ఆలోచనను కూడా మానుకున్న వారు అనేక మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పెట్టుబడిగా బంగారం కొనుగోలు చేసే వారు సయితం ధరలను చూసి వెనుకంజ వేస్తున్నారు.
వెండి కూడా భారీగానే...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.1,630 పెరిగింది. వెండిలోనూ భారీగానే పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,300 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,320కు గా నమోదయింది. ఇక కిలో వెండి ధర కూడా బాగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 74,000 రూపాయలకు చేరుకుంది.