వావ్.. బంగారం ధరలకు బ్రేక్

దేశంలో బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.500లు తగ్గింది. ఇక వెండి ధరలు కూడా తగ్గాయి.

Update: 2023-03-21 04:05 GMT

బంగారం ధరలు తగ్గినప్పపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కొనుగోలు చేయాలనుకున్న వారికి సంతోషకరమైన వార్త. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు కొంత తగ్గుతుండటం పసిడి ప్రియులకు ఊరట కలిగించే అంశం. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం, కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ బంగారంపై పెంచడం వంటివి ధరల పెరుగుదలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వారన్నట్లుగానే గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండటంతో అందరిలోనూ ఆందోళన బయలుదేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేయలేమని చాలా మంది ఆవేదన కూడా చెందుతున్న సమయంలో బంగారం ధరలు తగ్గడం కొంత ఊరట కలిగించే అంశమే.

వెండి కూడా...
తాజాగా గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. దేశంలో బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.500లు తగ్గింది. ఇక వెండి ధరలు కూడా తగ్గాయి. వెండి ధర స్వల్పంగానే తగ్గింది. కిలో వెండి ధరపై రూ.100లు మాత్రమే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,800 రూపాయలకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,780 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 74,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News