పసిడిప్రియులకు చేదు వార్త
దేశంలో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ.200లు పెరిగింది.
బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. కానీ ధరలు పెరుగుతున్నాయని మాత్రం కొనుగోళ్లు పెద్దగా తగ్గడం లేదు. వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచడం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బంగారం ధరలు వరసగా పెరుగుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన వ్కక్తమవుతుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరగడంతో తాము కొనుగోలు చేయలేకపోతున్నామన్న ఆవేదన వారు వ్యక్తపరుస్తున్నారు. కానీ దేశంలో పెరిగే బంగారం ధరలకు తామేమీ చేయలేమని వ్యాపారులు చెబుతున్నారు.
వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ.200లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,150 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర .57,980 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,000 రూపాయలకు చేరుకుంది.