గోల్డ్ లవర్స్‌కు గ్రేట్ రిలీఫ్

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి

Update: 2023-03-04 04:56 GMT

బంగారం ధరలు తగ్గితే ఉండే కిక్కు వేరు. కొనుగోలు చేసినా లేకపోయినా బంగారం తమకు అందుబాటులోకి వచ్చిందని సంతృప్తి చెందే వారు భారతీయుల్లో అధికమంది ఉన్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు జరుగుతుంటాయి. గతంలో పెళ్లిళ్లు, వేడుకల సందర్భంగానే బంగారాన్ని కొనుగోలు చేసే వారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేయడం భారతీయుడు అలవాటుగా మార్చుకున్నారు. అప్పటి నుంచే బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ పెరగడంతో ధరలు కూడా ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి.

పెరిగిన వెండి ధరలు...
అయితే తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. గత మూడు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతుండటం పసిడి ప్రియులకు ఊరట కల్గించే అంశం. వెండి కిలో పై రూ.400లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,750 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,450 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 70,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News