బాబోయ్ బంగారం ధరలు

ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.100లు పెరిగింది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి

Update: 2023-03-05 03:49 GMT

బంగారం ధరలు ఎప్పుడూ అంతే. ధరలు పెరుగుతుంటే ఇక ఆగవు. పెరిగితే ధరలు ఎక్కువగా, తగ్గితే స్వల్పంగా మాత్రమే బంగారం ధరలు ఉంటాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బంగారం దిగుమతులను కూడా కేంద్రం తగ్గించింది. రూపాయి బలపడటం కోసం బంగారం దిగుమతులను తగ్గించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా ధరలు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులకు అందనంత దూరంలో ధరలున్నాయి. బంగారం కొనాలంటే ఇక మధ్య తరగతి ప్రజలకు కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

స్థిరంగా వెండి ధరలు...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.100లు పెరిగింది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,850 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,550 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 70,000 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News