పసిడిప్రియులకు శుభవార్త

కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈ రోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2023-03-06 03:27 GMT

బంగారం అంటే అందరికీ మోజు. దానిని కొనుగోలు చేయాలని ప్రతి ఒక్క భారతీయ మహిళ కోరుకుంటుంది. తమకున్న దానిలో కొంత మొత్తాన్ని బంగారానికి వెచ్చించడానికి మహిళలు ఇష్టపడతారు. పసిడి అంటే ప్రాణం ఇచ్చే వారు అధికం కావడంతో దానికి డిమాండ్ పెరిగింది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయని చెబుతుంటారు. ఇక రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచడం, బంగారం దిగుమతులను తగ్గించడం కూడా ధరలు పెరగడానికి కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయినా బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి.

స్థిరంగా ధరలు...
గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈ రోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,850 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,550 రూపాయలుగా కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 70,000 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News