పసిడిప్రియులకు ఊరట
బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. వాటిని అదుపు చేయడం సాధ్యం కాదు.
బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. వాటిని అదుపు చేయడం సాధ్యం కాదు. మరికొద్ది రోజుల్లోనే తులం బంగారం డెబ్భయి వేలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో కొనుగోళ్లు కూడా భారీగా పెరుగుతాయి. దీంతో పాటు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పటికే ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఇక రాను రాను బంగారం కొనాలంటే ధనవంతులకే సాధ్యమవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. బంగారాన్ని ఒక అపురూపమైన వస్తువుగా మధ్య, పేద తరగతి ప్రజలు చూడాల్సిన రోజులు ఎంతో దూరం లేవన్నది వాస్తవం. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని సొంతం చేసుకోలేకపోతున్నారు. భవిష్యత్‌లో ఆ కొంత మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేసే వీలుండదన్నది అచనా వినిపిస్తుంది.
స్థిరంగా వెండి...
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.140లు తగ్గింది. స్వల్పంగా బంగారం ధరలు తగ్గడం పసిడిప్రియులకు ఊరట కలిగించే విషయమే. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,710 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,690 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 76,000 రూపాయలతో నిలకడగా కొనసాగుతుంది.