బంగారం ధరలు తగ్గేశాయ్

బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..

Update: 2023-06-22 03:20 GMT

బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,000 ఉండగా, నేడు 300 తగ్గడంతో, గోల్డ్ ధర రూ.54,700గా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60,000లు ఉండగా, నేడు 330 తగ్గడంతో, గోల్డ్ ధర రూ.59,670గా ఉంది. ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ.54.850, 24 క్యారెట్స్ రూ.59,820గా ఉంది. ముంబైలో పసిడి ధర 22 క్యారెట్స్ రూ.54,700, 24 క్యారెట్స్ రూ.59,670గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్స్ రూ.54,700, 24 క్యారెట్స్ రూ.59,670 గా ఉంది. విశాఖపట్నంలో తులం గోల్డ్ ధర రూ 54,700 కాగా 24 క్యారెట్స్ పసిడి ధర రూ.59,670, విజయవాడలో 54,700, 24 క్యారెట్స్ రూ.59,670 గా ఉంది. కిలో వెండి ధరలు ఢిల్లీలో రూ.73.000, ముంబైలో వెండి ధర రూ.73.000, బెంగళూరులో రూ.72.000, హైదరాబాద్ లో రూ.76,500, విశాఖపట్నంలో రూ.76.500, విజయవాడలో రూ.76,500లుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. నిన్న ఉదయం ఔన్సు స్పాట్ గోల్డ్ 1937 డాలర్ల వద్ద ఉండగా.. నేడు 1932 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఆర్థిక అనిశ్చితి, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, డాలర్ పుంజుకోవడం వంటి కారణాల వల్ల బంగారం ధర తగ్గుతూ వస్తుంది.


Tags:    

Similar News