జాక్ పాట్ కొట్టేసిన గూగుల్ పే యూజర్లు.. ఒక్కొక్కరికీ రూ.80 వేల వరకూ జమ

కాకపోతే అప్పటికే జమ అయిన మొత్తాన్ని ఖర్చు చేసిన వారి విషయంలో ఏమీ చేయలేకపోయింది. అలాంటి యూజర్ల విషయంలో తదుపరి..

Update: 2023-04-10 08:00 GMT

google pay users

ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్ లు తొలినాళ్లలో యూజర్లను పెంచుకునేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు బాగా ఇచ్చారు. ఇప్పుడు ఫోన్ పే లో అలాంటి ఆఫర్లు లేవు కానీ.. గూగుల్ పే లో అప్పుడప్పుడూ ఎంతోకొంత క్యాష్ బ్యాక్ వస్తుంటుంది. అలాంటి క్యాష్ బ్యాక్ తోనే గూగుల్ పే యూజర్లు జాక్ పాక్ కొట్టేశారు. అయితే ఇది సాంకేతిక లోపంతో జరిగిన తప్పిదం. గూగుల్ పే యూజర్లకు పది నుంచి వెయ్యి డాలర్ల మేర అదనంగా జమ అవుతున్న విషయం వెలుగు చూసింది.

కొందరు యూజర్లకు స్క్రాచ్ కార్డుల ద్వారా రూ.80 వేల వరకూ క్రెడిట్ అవ్వగా వాటిని చూసి సంతోషపడ్డారు. కొంతమంది తమకు కావలసినవాటిని వెంటనే ఆ మొత్తంతో కొనుగోలు చేయగా.. మరికొందరు అకౌంట్లోనే ఉంచుకున్నారు. జరిగిన తప్పిదాన్ని గుర్తించిన గూగుల్.. పొరపాటుగా జమ చేసిన మొత్తాన్ని మళ్లీ తిరిగి డెబిట్ చేసింది. కాకపోతే అప్పటికే జమ అయిన మొత్తాన్ని ఖర్చు చేసిన వారి విషయంలో ఏమీ చేయలేకపోయింది. అలాంటి యూజర్ల విషయంలో తదుపరి ఎలాంటి చర్యలూ ఉండవని స్పష్టం చేసింది. గూగుల్ పేలో గ్లిచ్ విషయాన్ని జర్నలిస్ట్ మిషాల్ రెహమాన్ ట్విట్టర్ లో వెల్లడించారు. ‘‘గూగుల్ పే ర్యాండమ్ గా యూజర్లకు ఉచితంగా డబ్బులు ఇస్తోంది. నేను ఇప్పుడే గూగుల్ పే తెరిచి చూశాను. 46 డాలర్లు రివార్డుగా జమ అయినట్టు కనిపించింది’’ అని ఆయన రాసుకొచ్చారు. ఎర్రర్ కారణంగా డబ్బు జమ అయిందని, ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నట్టు గూగుల్ పే నుంచి మెయిల్ కూడా వచ్చినట్టు వెల్లడించారు.



.


Tags:    

Similar News