హలో కాదు.. వందేమాతరం అనాల్సిందే
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి అమలులోకి రానుంది. ఇకపై ప్రభుత్వ అధికారులు హలో అనకూడదు
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి అమలులోకి రానుంది. ఇకపై ప్రభుత్వ అధికారులు హలో అనకూడదు. వందేమాతరం అనాలి. దీనివల్ల ప్రజల్లో కూడా చైతన్యం వస్తుందని భావిస్తున్నారు. ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. జాతీయ భావం వెల్లి విరియాలంటే హలో అనే కంటే అక్టోబరు 2వ తేదీ నుంచి వందేమాతరం అని అనాల్సిందేనంటూ ఏక్‌నాథ్ షిండే సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో...
ఈరోజు నుంచి హలో బదులు వందేమాతరం మాట ప్రభుత్వ కార్యాలయాల్లో వినిపిస్తుంది. ఫోన్ లో అయినా, నేరుగా కలసుకున్నా ఇలాగే పిలవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కలుసుకున్నప్పుడు ఒకిరినొకరు వందేమాతరం అని పిలుచుకుంటే ఆప్యాయతతో పాటు జాతీయ భావం పెరుగుతుందని కూడా షిండే ప్రభుత్వం అభిప్రాయపడింది. తొలుత ప్రభుత్వ అధికారుల నుంచి ఈ ప్రక్రియను మొదలు పెట్టబోతోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ విన్నూత్న ప్రచారానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.