అకీరా విషయంలో హెచ్చరికలు

అకీరా అనే ప్రమాదకరమైన ర్యాన్సమ్‌వేర్ కి వ్యతిరేకంగా ప్రభుత్వం నెటిజన్లను హెచ్చరికలు జారీ చేసింది. ఇది ప్రధానంగా

Update: 2023-07-24 13:36 GMT

అకీరా అనే ప్రమాదకరమైన ర్యాన్సమ్‌వేర్ కి వ్యతిరేకంగా ప్రభుత్వం నెటిజన్లను హెచ్చరికలు జారీ చేసింది. ఇది ప్రధానంగా Windows, Linux ద్వారా నడుస్తున్న సిస్టమ్‌లను లక్ష్యంగా చేసుకుని.. దాడి చేస్తోంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఇటీవల ఈ కొత్త ఇంటర్నెట్ వైరస్ ఆవిర్భావాన్ని నివేదిస్తూ ఒక సలహాను జారీ చేసింది. విండోస్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలతో నడిచే కంప్యూటర్లలోకి ‘అకీరా’ ర్యాన్సమ్‌వేర్ చొరబడి డేటాను దొంగిలిస్తోందని అందులో తెలిపింది. ఈ డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి యూజర్ ఉపయోగించడానికి వీలు లేకుండా లాక్ చేస్తుందని హెచ్చరించారు. కీలకమైన డేటాతో డబ్బుని కూడా కొట్టేయాలని అకీరా వెనుక ఉన్న వ్యక్తలు ప్రయత్నిస్తూ ఉన్నారు. బాధితుల దగ్గర నుండి డబ్బులు కావాలని బెదిరించడమే కాకుండా.. చెల్లించడానికి నిరాకరిస్తే, వారి డేటాను డార్క్ వెబ్‌లో విడుదల చేస్తామని అకీరా వెనుక ఉన్న గ్రూప్ బెదిరిస్తుంది.

అకీరా ర్యాన్సమ్‌వేర్ బారిన పడకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు పాటించాలని సెర్ట్- ఇన్ సూచించింది. ఇలాంటి దాడుల నుంచి కాపాడుకోవడానికి ఇంటర్నెట్ యూజర్లు కనీస ప్రొటోకాల్స్‌ని ఫాలో కావాలని తెలిపింది. ముఖ్యమైన డేటాని యూజర్లు ఆఫ్‌లైన్‌లో బ్యాకప్ చేసుకోవాలని తెలిపింది. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలని సూచించింది. ఈ ర్యాన్సమ్‌వేర్ అటాక్ అయినప్పుడు ఫైల్ పేరు '.akira' అనే ఎక్స్టెన్షన్ తో ఉంటుందట..! Windows Restart Manager APIని ఉపయోగించి Windows సేవలను నిలిచిపోయేలా ఈ ర్యాన్సమ్‌వేర్ చేస్తుంది.


Tags:    

Similar News