జీఎస్టీ పన్ను పెంపు తాత్కాలికంగా వాయిదా

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. చేనేత, జౌళి రంగాలపై జీఎస్టీ పెంపు అమలును వాయిదా వేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది

Update: 2021-12-31 08:15 GMT

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ప్రధానంగా చేనేత, జౌళి రంగాలపై జీఎస్టీ పెంపు అమలును వాయిదా వేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు చేనేతపై జీఎస్టీ పెంపును వ్యతిరేకించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రులు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

పెంపు నిర్ణయాన్ని.....
చేనేతపై జీఎస్టీని పన్నెండు శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి అమలులోకి రావాల్సి ఉంది. కానీ రాష్ట్రాలు ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో తాత్కాలింగా ఈ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేశారు. దీంతో రేపట నుంచి అమలు కావాల్సిన పెంపు వాయిదా పడినట్లే. ఈసారి సమావేశాన్ని నేరుగా నిర్వహించాలని సమావేశం అభిప్రాయపడింది.


Tags:    

Similar News