బీజేపీలో చేరనున్న హార్థిక్ పటేల్
పాటీదార్ల ఉద్యమ నేత హార్థిక్ పటేల్ బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆయన తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు
గుజరాత్ పాటీదార్ల ఉద్యమ నేత హార్థిక్ పటేల్ బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆయన తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ నేతగా ఉన్న హార్ధిక్ పటేల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పాటీదార్ల రిజర్వేషన్ల కోసం ఆయన అనేక ఏళ్లు ఉద్యమం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరారు. కానీ గుజరాత్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో....
గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హార్థిక్ పటేల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దేశ, రాష్ట్ర, ప్రజ, సామాజిక ప్రయోజనాల కోసం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని హార్థిక్ పటేల్ ట్వీట్ చేశారు. గుజరాత్ లో వరస గెలుపులతో బీజేపీకి తిరుగులేకుండా ఉంది. కొన్ని దశాబ్దాలుగా బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. హార్థిక్ పటేల్ చేరికతో మరింత పార్టీకి బలం చేకూరినట్లయింది. ఆయన ఈరోజు పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు.