గుజరాత్ లో మళ్లీ 400 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

గుజరాత్ లో భారీగా హెరాయిన్ పట్టుకున్నారు. నాలగువందల కోట్ల విలువైన 77 కేజీల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2021-12-20 03:41 GMT

గుజరాత్ తీరంలో భారీగా హెరాయిన్ ను పట్టుకున్నారు. నాలగువందల కోట్ల విలువైన 77 కేజీల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోస్ట్ గార్డ్స్ తనిఖీలో ఈ విషయం బయటపడింది. గుజరాత్ తీరానికి వరసగా హెరాయిన్ పట్టుబడుతుంది. ఇటీవల మూడువేల కోట్ల విలువైన హెరాయిన్ ను ముంద్రా పోర్టులో పట్టుబడిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్ నుంచి....
పాకిస్థాన నుంచి వస్తున్న ఫిషింగ్ బోట్ నుంచి 77 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. బోట్ ను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హెరాయిన్ ఎందుకువస్తుంది? ఎక్కడ నుంచి తెప్పిస్తున్నారు? ఎవరు తెప్పిస్తున్నారు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకల కోసమే ఈ హెరాయిన్ ను తెప్పించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, కోస్ట్ గార్డ్స్ సంయుక్త ఆపరేషన్ లో ఈ హెరాయిన్ గుట్టు బయటపడింది.


Tags:    

Similar News