తమిళనాడులో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి

భారీ వర్షాలకు ముగ్గురు మరణించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెన్నైలో రోడ్లపై భారీగా నీరు..

Update: 2022-11-01 13:22 GMT

heavy rains in tamilnadu

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దేశమంతా ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో చలితీవ్రత కూడా పెరిగింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులోని చెన్నై నగరం సహా 13 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో 7 జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో కురిసిన కుండపోత వర్షాలకు తమిళనాడులోని అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.

భారీ వర్షాలకు ముగ్గురు మరణించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెన్నైలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాలకు భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) కూడా నవంబరు 2 వరకు చెన్నై నగరానికి భారీ వర్ష సూచన చేసింది. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆర్ఎంసీ పేర్కొంది.



Tags:    

Similar News