Ramadan : నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం
నేటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయింది. రేపు ఉదయం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి
నేటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. దేశ వ్యాప్తంగా రేపు ఉదయం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో అన్ని మసీదుల వద్ద ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. మసీదులను ఇప్పటికే రంగులు వేయడమే కాకుండా విద్యుత్తు దీప కాంతులతో అలంకరించారు.
రేపటి నుంచి ఉపవాస దీక్షలు...
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలుంటారు. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ మంచినీళ్లు కూడా ముట్టరు సాయంత్రం ఇఫ్తార్ తో ఉపవాస దీక్షను ముగించనున్నారు. మొత్తం నెల రోజుల పాటు జరగనున్న ఈరంజాన్ మాసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా జరుగుతుంది. రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావించే ముస్లిం సోదరులు ఈ మాసం అంతా అత్యంత కఠిన నిబంధనలను అనుసరిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు.