గోల్డ్ లవర్స్‌కు గ్రేట్ రిలీఫ్

ఈ ఏడాది పది గ్రాముల డెబ్బయి వేలకు చేరుకుంటుందన్న నిపుణుల అంచనాతో ధరలు తగ్గితే పసిడి ప్రియులకు ఈరోజు ఊరట లభించినట్లే

Update: 2023-03-23 04:22 GMT

బంగారం ధరలు తగ్గితే ఎంత సంతోషమో. పది గ్రాముల బంగారం ఈ ఏడాది డెబ్బయి వేలకు చేరుకుంటుందన్న నిపుణుల అంచనాతో కొంత ధరలు తగ్గినా అది పసిడి ప్రియులకు ఎంత ఊరట? అవును.. పెళ్లిళ్లకు, వేడుకలకు బంగారం కొనుగోలు చేయడం భారతీయ సంప్రదాయం. అందుకే భారత్ లో బంగారు ఆభరణాలనే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. విదేశాల్లో అయితే గోల్డ్ బాండ్స్ పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. కానీ భారత్ లో మాత్రం ఆభరణాలను కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. కష్ట సమయాల్లోనూ బంగారం ఆదుకుంటుంది. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన ఎందరికో బంగారం ఆసరాగా నిలిచింది. బంగారం కుదువ పెట్టి బతుకీడ్చిన వారు కరోనా టైంలో ఎందరో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే కాస్త డబ్బులుంటే చాలు బంగారాన్ని కొనుగోలు చేయడానికే భారతీయులు ఎక్కువగా ఇష్టపడతారు.

పెరిగిన వెండి...
ఇక తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.800లు తగ్గింది. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర పై రూ.500లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,200 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,130 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 74,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News