మరోసారి పెరిగిన చమురు ధరలు
దేశీయ చమురు పంపిణీ సంస్థలు సీఎన్జీ ధరలను పెంచాయి. ఢిల్లీలో కిలో సీఎన్జీపై రూ.2.5 వడ్డించాయి. దీంతో కిలో సీఎన్జీ ధర రూ.71.61
న్యూ ఢిల్లీ : చమురు ధరలు మరోసారి పెరిగాయి. అయితే ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. దేశీయ చమురు పంపిణీ సంస్థలు సీఎన్జీ ధరలను పెంచాయి. ఢిల్లీలో కిలో సీఎన్జీపై రూ.2.5 వడ్డించాయి. దీంతో కిలో సీఎన్జీ ధర రూ.71.61కు పెరిగింది. అలాగే నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ లో రూ.74.17కు, గురుగ్రామ్ లో రూ.79.94కు చేరింది.
అలాగే ఆర్థిక రాజధాని ముంబైలో కిలో సీఎన్జీ ధర ఏకంగా రూ.5 వరకూ పెరిగింది. దీంతో సీఎన్జీ ధర రూ.72కు పెరిగింది. సీఎన్జీ ధరల పెంపుతో.. దాని ఆధారంగా నడిచే ఆటోల ఛార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. గత నెల 22వ తేదీ నుంచి 16 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.