కేజ్రీవాల్ కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారా?

ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకునేందుకు సిద్ధమయింది

Update: 2022-01-02 04:56 GMT

ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకునేందుకు సిద్ధమయింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఢిల్లీలో రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే ఆంక్షలను విధించారు. నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.

మరిన్ని చర్యలు...
సినిమాహాళ్లు, మాల్స్ వంటి వాటిని మూసివేశారు. ఢిల్లీలో ఇప్పటికే 351 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకునే దిశగా కేజ్రీవాల్ చర్యలు తీసుకోనున్నారు.


Tags:    

Similar News